logo

నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌

చింతామణి నాటక ప్రదర్శన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఆదివారం నగరంలోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్‌ కళాకారుడు మినగల్లు సుధాకర్‌ పెట్రోల్‌ ప్యాకెట్‌తో వేదిక మీదకు వచ్చి ఆత్మహత్యాయత్నం

Published : 24 Jan 2022 06:12 IST


సమావేశంలో మాట్లాడుతున్న కళాకారుడు పుల్లయ్య

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: చింతామణి నాటక ప్రదర్శన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఆదివారం నగరంలోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్‌ కళాకారుడు మినగల్లు సుధాకర్‌ పెట్రోల్‌ ప్యాకెట్‌తో వేదిక మీదకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని ప్రయత్నాన్ని తోటి కళాకారులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కార్యదర్శి విజయకుమార్‌, పుల్లయ్య మాట్లాడుతూ కరోనా కారణంగా కళాకారులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకులు వెంకమరాజు, చక్రపాణి, మురళీమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని