logo

భారీగా గోవా మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

జిల్లాకు గోవా మద్యం భారీగా తరలి వస్తోంది.. ఈక్రమంలో పలుచోట్ల విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెబ్‌ అధికారుల అదుపులోకి తీసుకొని. వారి నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక సెబ్‌

Published : 20 May 2022 01:44 IST
వివరాలు వెల్లడిస్తున్న సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లాకు గోవా మద్యం భారీగా తరలి వస్తోంది.. ఈక్రమంలో పలుచోట్ల విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెబ్‌ అధికారుల అదుపులోకి తీసుకొని. వారి నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక సెబ్‌ నెల్లూరు-1 స్టేషన్‌లో జేడీ శ్రీలక్ష్మి వివరాలు వెల్లడించారు.. నవాబుపేట బంగ్లాతోటకు చెందిన వినోద్‌కుమార్‌ పొరుగు రాష్ట్రాల మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. గతంలో తెలంగాణ మద్యం అమ్ముతుండగా సెబ్‌ అధికారులు అరెస్టు చేసినా మార్పు రాలేదు. వినోద్‌కుమార్‌ తన స్నేహితుడు నవాబుపేట శ్రీదేవి రైస్‌మిల్లు ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు గంగరాజుతో కలిసి 624 గోవా మద్యం సీసాలు కొనుగోలు చేశాడు. ఒక సీసా రూ.45 చొప్పున కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో రూ.110 చొప్పున పలువురికి అమ్మాడు. 18న వినోద్‌కుమార్‌ కారులో పెద్ద ఎత్తున గోవా మద్యాన్ని ఆత్మకూరుకు తరలిస్తున్నాడని ఎస్పీ సీహెచ్‌ విజయరావు, సెబ్‌ జేడీ శ్రీలక్ష్మికి సమాచారం అందింది. సెబ్‌ ఏఈఎస్‌ ఎస్‌.కృష్ణకిషోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటేశ్వర రావు, డీటీఎఫ్‌ సిబ్బంది పొట్టేపాలెం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. 326 గోవా మద్యం సీసాలను, కారును స్వాధీనం చేసుకున్నారు. వినోద్‌కుమార్‌ను విచారించగా ఆత్మకూరులోని గంగరాజు ద్వారా గోవా మద్యం విక్రయించేందుకు వెళుతున్నాడని, అతని సమాచారంతో ఆత్మకూరు సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నయనతార గంగరాజును రవితేజ కల్యాణ మండపం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 78 మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో నెల్లూరు-1, 2, ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్లు కేపీ కిషోర్‌, వెంకటేశ్వర రావు, బి.నయనతార, డీటీఎఫ్‌ ఎస్సై ప్రభాకర్‌ రావు, ఎస్సై శకుంతలా దేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని