logo

జెన్‌కో ప్రైవేట్‌ పరం సిగ్గుచేటు

ఏపీ జెన్‌కో ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. నగరంలోని పుర మందిరంలో దామోదర సంజీవయ్య థర్మల్‌ విద్యుత్తు కేంద్రం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల సదస్సు నిర్వహించారు.

Published : 26 May 2022 03:22 IST


ప్రసంగిస్తున్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌.. వేదికపై వివిధ సంఘాల నాయుకులు

నెల్లూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే: ఏపీ జెన్‌కో ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ అన్నారు. నగరంలోని పుర మందిరంలో దామోదర సంజీవయ్య థర్మల్‌ విద్యుత్తు కేంద్రం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడం దారుణమని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థ నష్టాల్లో ఉందని ప్రచారం చేసి ప్రైవేట్‌ పరం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శాసన మండలి పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ థర్మల్‌ విద్యుత్తు కేంద్రాన్ని ప్రైవేట్‌ పరం చేస్తే కరెంట్‌ ఛార్జీలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత ఉండదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్తు కేంద్రాల ప్రైవేటీకరణకూ ఇది నాంది పలుకుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ ఎం.మోహన్‌రావు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య, సీసీఐఎంఎల్‌ నాయకులు సునీత, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని