logo

సంగీత వాణికి... సింహపురి కళాంజలి

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త సంగీతాభిమానులను కలచివేసింది.

Published : 05 Feb 2023 01:19 IST

నెల్లూరు టౌన్‌హాల్‌లో కళాంజలి పురస్కారం అందుకున్న వాణీ జయరాం (పాతచిత్రం)

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త సంగీతాభిమానులను కలచివేసింది. ఎన్నో మధుర గీతాలను ఆలపించి.. సంగీతాభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆమెకు జిల్లాతోఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పించారు. వాణీ జయరాం నెల్లూరులో కళాంజలి పురస్కారం అందుకున్నారు. ఆ సంస్థ ఏటా అందించే ఈ పురస్కారాన్ని 2013లో నెల్లూరు టౌన్‌హాల్‌లో స్వీకరించారు.  ఆ సందర్భంగా నెల్లూరీయుడైన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొన్ని పాటల సమాహారాన్ని ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. కళాంజలి సంస్థ నిర్వాహకులు అనంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో సినీ గేయ రచయిత వెన్నెలకంటి, అప్పటి కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. నెల్లూరుకు చెందిన హాస్యనటుడు దోర్నాల హరిబాబు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలోవాణీజయరాం చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. ఆమె ఆలపించిన ఎన్నో మధుల గీతాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని.. ఆమె లేని లోటు తీర్చలేనిదని పలువురు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని