logo

ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే

ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే

Updated : 28 Mar 2024 06:22 IST

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం) : ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం.. వాటిని తిరిగి అప్పగిస్తారు. లేదంటే.. ఆ లైసెన్సులు రద్దు చేసే అధికారం.. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పోలీసుశాఖకు ఉంది. ఇంకా చెప్పాలంటే.. లైసెన్సుల జారీలోనే అవసరమైనప్పుడు ఆయుధాలు డిపాజిట్‌ చేయాలనే నిబంధన ఉంటుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రాగానే శాంతిభద్రతల దృష్ట్యా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటారు.

పిస్తోల్‌.. రివాల్వర్‌..

 పారిశ్రామిక, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు.. నక్షత్రాల హోటళ్లు.. కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ స్టేషన్లు ఉండటంతో దేశ, విదేశాల నుంచి రాకపోకలు సాగుతుంటాయి. ఆ క్రమంలో పెద్ద సంస్థలు భద్రతాపరంగా తుపాకులతో కూడిన సిబ్బందిని నియమించుకుంటుండగా- వ్యక్తిగత భద్రతకూ కొందరు ప్రాధాన్యమిచ్చి.. తుపాకులను దగ్గర ఉంచుకుంటున్నారు. ఆ క్రమంలో జిల్లాలో సెక్యూరిటీ సిబ్బంది డబుల్‌ బ్యారెట్‌ గన్లు అందుబాటులో ఉంచుకుంటుండగా- వ్యక్తిగతంగా పిస్తోల్‌, రివాల్వర్‌ లాంటి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.

 జిల్లా వ్యాప్తంగా ఉన్నవి : 533
డిపాజిట్‌ అయినవి : 533
బ్యాంకుల్లో ఉన్నవి : 47

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని