logo

జగనన్నా.. హామీ మరిచావా!

కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్‌ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు.

Published : 19 Apr 2024 04:04 IST

న్యూస్‌టుడే, కావలి

కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్‌ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. ఏడాదవుతున్నా అతీగతీ లేదు. ప్రభుత్వ సమయం ముగిసిపోయింది. లబ్ధిదారుల ఆశలన్నీ ఆవిరయ్యాయి.

  • ఇందిరమ్మ  ఇళ్ల పేరుతో 2005-06, 06-07, 07-08 ఆర్థిక సంవత్సరాల్లో అమలైన పక్కా  ఇళ్ల పథకం పట్టణంలో చతికిలబడింది. అప్పట్లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఈ పథకం రాష్ట్రమంతా అమలైంది. కావలిలో సుమారు నాలుగు వేల మంది పేద కుటుంబాలకు సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలని తలచారు. పలు కారణాలతో నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా వీటిని పూర్తి చేయిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారులతో అంచనాలు రూపొందించారు. వీటి ఆధారంగా సీఎం హామీ ఇచ్చినా పైసలు ఇవ్వలేదు. ఫలితంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
  • అప్పట్లో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు నాయకులుగా ఉన్న వారే నేడు వైకాపాలో ఎక్కువగా ఉన్నారు. వారే గుత్తేదారులుగా, చాలా ఇళ్లకు బినామీలుగా ఉన్నారనే విమర్శలున్నాయి. అంతేగాక పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి గృహనిర్మాణ అధికారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారు. అక్కడ పొందిన బిల్లుల మొత్తాలకు చేసిన పనుల విలువకు పొంతన లేదు. చివరకు ఆ కాలనీకే మోక్షం లేకుండా చేసేశారు. సుమారు ఒకటిన్నర దశాబ్దం దాటినా ఇంతవరకు ఆ ఇళ్లు శిథిల గూళ్లుగా కనిపిస్తున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని