logo

కార్డు ఆసరా.. పన్ను గోసరా

రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛనుదారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. కొత్తగా మంజూరైన వారికి పంపిణీ ప్రక్రియ పూర్తవుతోంది. పాత పింఛను లబ్ధిదారులకూ గుర్తింపు నంబరు(ఐడీ)ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారుల పేరు, వయసు, తండ్రి/భర్త పేరు, పింఛను రకం, ఐడీ నంబరు ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.

Published : 26 Sep 2022 02:27 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛనుదారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. కొత్తగా మంజూరైన వారికి పంపిణీ ప్రక్రియ పూర్తవుతోంది. పాత పింఛను లబ్ధిదారులకూ గుర్తింపు నంబరు(ఐడీ)ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారుల పేరు, వయసు, తండ్రి/భర్త పేరు, పింఛను రకం, ఐడీ నంబరు ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్నిచోట్ల కార్డు పంపిణీ చేసే సమయంలో పంచాయతీ సిబ్బంది పనిలో పనిగా పేరుకుపోయిన ఇంటి బకాయిలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. నందిపేట్‌ మండలంలో ఈ తంతు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి, బీడీ కార్మిక, కల్లుగీత, చేనేత మొత్తం కలిపి 48,022 పింఛన్లు మంజూరయ్యాయి. పాతవి 2,38,733 ఉన్నాయి. ఇందులో నందిపేట్‌ మండలంలో 15,870 కార్డులున్నాయి. వీరందరికి కార్డులు అందజేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఎంపీడీవో కిరణ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. కొత్త కార్డుల పంపిణీ కొనసాగుతోందని, పాత లబ్ధిదారులకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కార్డు ఇచ్చేటప్పుడు ఇంటి పన్ను తప్పనిసరి అని చెప్పలేదని, లబ్ధిదారులకు గుర్తుచేసి కట్టించుకుంటున్నట్లు వివరించారు.  

- న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని