logo

దోమకొండ కోటకు యునెస్కో పురస్కారం

కామారెడ్డి జిల్లా దోమకొండ కోట యునెస్కో ఆసియా- పెసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌, అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌- 2022కు ఎంపికైంది.

Published : 27 Nov 2022 06:09 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి, న్యూస్‌టుడే, దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ కోట యునెస్కో ఆసియా- పెసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌, అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌- 2022కు ఎంపికైంది. వివిధ దేశాల నుంచి మొత్తం 287 ప్రతిపాదనలు రాగా అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్టులను యునెస్కో ఎంపిక చేసింది. ప్రైవేటు నిర్మాణమైనప్పటికీ సాంస్కృతిక స్థలాన్ని విజయవంతంగా పునరుద్ధరించిన నేపథ్యంలో ఎంపిక చేసినట్లు ట్రస్ట్‌ సభ్యులు చెప్పారు.

11 ఏళ్లపాటు పునరుద్ధరణ

కోటకు పూర్వవైభవం తేవాలనే లక్ష్యంతో 2011లో పనులు ప్రారంభించారు. ప్రముఖ కన్జర్వేటివ్‌ అర్కిటెక్ట్‌ అనురాధానాయక్‌ను చీఫ్‌ కన్సల్టెంట్‌గా నియమించారు. సుమారు 11 ఏళ్ల పాటు పనులు కొనసాగించారు. అవసరమైన అనుమతులను పురావస్తుశాఖ నుంచి తీసుకున్నారు. పునరుద్ధరణలో భాగస్వాములైన స్థానిక కళాకారులకు ఉన్నతస్థాయి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ప్రతిష్ఠాత్మకమైన యునెస్కో అవార్డు రావడం పట్ల దోమకొండ సంస్థాన్‌ కుటుంబ వారసుల్లో ఒకరైన కామినేని అనిల్‌, ఆయన సతీమణి శోభన హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని