logo

‘ఎంపీకి ప్రజలే బుద్ధిచెబుతారు’

అభివృద్ధి పనుల్లో రాజీపడే ప్రసక్తి లేదని, పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా పట్టణంలోని 9వ వార్డు, మంథని, పిప్రిలో పర్యటించి ప్రగతి పనులపై సమీక్షించారు.

Published : 04 Dec 2022 04:02 IST

మామిడిపల్లిలో ఆర్వోబీ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల్లో రాజీపడే ప్రసక్తి లేదని, పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా పట్టణంలోని 9వ వార్డు, మంథని, పిప్రిలో పర్యటించి ప్రగతి పనులపై సమీక్షించారు. మామిడిపల్లిలో జరుగుతున్న ఆర్వోబీ పనులను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పూర్తిచేయలని ఆదేశించారు. 9వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎంపీ అర్వింద్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ‘ఏ పథకంలో నీ వాటా ఎంతుందో చెప్పాలి’ అని సవాల్‌ చేశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పుర ఛైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, వైస్‌ఛైర్మన్‌ షేక్‌మున్ను, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, కౌన్సిలర్లు కవిత, సంగీత, ఆకుల రాము, మంథని సర్పంచి లింబారెడ్డి, పిప్రి సర్పంచి అసపురం దేవి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

నిధులు మంజూరు: మామిడిపల్లి మున్నూరుకాపు సంఘం భవనానికి రూ.25 లక్షలు, దూదేకుల భవనానికి రూ.5 లక్షలు, దేవాంగ సంఘానికి రూ.10 లక్షలు, పాఠశాల మైదనానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. పిప్రి కుడి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చెరువు మధ్యలో ఐలాండ్‌, బోటింగ్‌, రెస్టారెంటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంథని రంగనాథాలయానికి రూ.48 లక్షలతో సీసీ రోడ్డు, మహిళా భవనానికి రూ.10 లక్షలు, మార్కెట్‌ యార్డులో కల్యాణ మండపానికి రూ.30 లక్షలు మంజూరు చేయనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని