logo

వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం

జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్‌ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు.

Updated : 29 Mar 2024 16:25 IST

ఎల్లారెడ్డి పట్టణం: జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్‌ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను పొందాలన్నారు. మొత్తం మండల వ్యాప్తంగా 14 సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు,  ఏ గ్రేడ్ కి రూ. 2203  బి గ్రేడ్ కి రూ. 2183 మద్దతు ధర నిర్దేశించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని