logo

ఈ- కేవైసీకి మరో అవకాశం

రేషన్‌ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు.

Updated : 20 Apr 2024 06:53 IST

ఉమ్మడి జిల్లాలో పూర్తిచేసుకోని వారు 19 శాతం

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: రేషన్‌ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి ఈకేవైసీ ప్రక్రియ నిలిపివేశారు. ప్రస్తుతం అవకాశం కల్పించడంతో లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 త్వరపడితే మేలు..

లబ్ధిదారులు అసలైనవారా కాదా అనే విషయాలు తెలుసుకునేందుకు కేంద్రం ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ప్రక్రియ చేయించుకోకపోయినా బియ్యం సరఫరా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈకేవైసీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆధార్‌ నవీకరించకపోవడం, చిన్నారుల వేలిముద్రలు అప్‌డేట్‌ చేయకపోవడం వంటి కారణాలతో చాలా మంది ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. వీరు రాష్ట్రంలోని ఎక్కడి రేషన్‌ దుకాణంలోనైనా ప్రక్రియ పూర్తి చేసుకునే వీలుంది.


 సద్వినియోగం చేసుకోవాలి
  మల్లికార్జున బాబు, డీఎస్‌ఓ కామారెడ్డి

ఈ కేవైసీకి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికైతే తుది గడువుపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని