logo

మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు

పద్మపూర్‌ అసెంబ్లీ పరిధిలో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని బరగఢ్‌ కలెక్టరు మనీషా బెనర్జీ చెప్పారు.

Published : 04 Dec 2022 02:19 IST

పోలింగ్‌లో అందరూ పాల్గొనాలి: బరగఢ్‌ కలెక్టరు మనీషా బెనర్జీ

మనీషా బెనర్జీ

భువనేశ్వర్‌, బరగఢ్‌ న్యూస్‌టుడే: పద్మపూర్‌ అసెంబ్లీ పరిధిలో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని బరగఢ్‌ కలెక్టరు మనీషా బెనర్జీ చెప్పారు. శనివారం పద్మపూర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సోమవారం ఏర్పాటయ్యే పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని 9 కంపెనీల కేంద్ర బలగాలను మావోయిస్ట్‌ ప్రభావిత 45 పోలింగ్‌ కేంద్రాల్లో నియమిస్తున్నట్లు వివరించారు. 319 కేంద్రాలకుగాను 152 సమస్యాత్మకమైనవిగా పరిగణించి ఆయాచోట్ల వీడియోగ్రఫీ, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటుతోపాటు మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. 6 పింక్‌ బూత్‌లు, 15 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, చలికాలం, కొన్నిచోట్ల మావోయిస్టుల కదలికలు ఉన్నందున పోలింగ్‌ వ్యవధి కుదించామని, ఎన్నికల యంత్రాంగం ఉత్తర్వుల మేరకు ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమహక్కు వినియోగించుకోవాలని కలెక్టరు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని