logo

ఉత్సాహంగా ఆశ్రమ పాఠశాలల క్రీడోత్సవాలు

రాయగడ జిల్లా గుణుపురం, రామన్నగుడ సమితుల్లోని ఆశ్రమ పాఠశాలల్లో క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.

Updated : 05 Feb 2023 06:50 IST

పల్లుపాయి ఆశ్రమ పాఠశాలలో విజేతలతో పోటీల నిర్వాహకులు

గుణుపురం, నూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం, రామన్నగుడ సమితుల్లోని ఆశ్రమ పాఠశాలల్లో క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. శుక్రవారం కొన్ని చోట్ల మొదలవ్వగా పలు పాఠశాలల్లో తుదిపోటీలు జరిగాయి. రామన్నగుడ సమితి పల్లుపాయి బాలికల ఉన్నత  ఆశ్రమ పాఠశాలలో జరిగిన ముగింపు సమావేశానికి సమితి అధ్యక్షులు రవి శంకర గమాంగ్‌ హాజరై మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. క్రీడావిజేతలకు బహమతులు అందజేశారు. జిల్లా సంక్షేమ అధికారి అశోక్‌ కుమార్‌ శత్పథి, జిల్లా విద్యాధికారి శ్యామఘణ భోయి, సమితి సంక్షేమ అధికారిణి జయశ్రీ బిస్సయి, ప్రధానోపధ్యాయురాలు స్వర్ణలత మహాపాత్రొ తదితరులు పాల్గొన్నారు. 

* రామన్నగుడ సమితి సొండిధమ్మిని పంచాయతీ బట్టొపులి గ్రామంలో పది రోజుల పాటు కొనసాగే వాలీబాల్‌ పోటీలను రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ సలహాదారు, జిల్లా బిజద అధ్యక్షులు సుధీర్‌ దాస్‌ శనివారం ఉదయం ప్రారంభించారు.  అతిథులను నిర్వాహకులు సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బిజద ఉపాధ్యక్షులు గొగొనొ బిహారి ఆచార్య, సర్పంచి భాస్కర కడ్రకా, సమితి సభ్యులు కమల లోచన ముటికా తదితరులు పాల్గొన్నారు.

* గుణుపురం సమితి భారసింగి ఉన్నత విద్యాలయంలో  క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.విద్యార్థులు క్రీడాజ్యోతిని క్రీడా మైదానానికి తీసుకురాగా, ముఖ్యఅతిధి శ్యామఘణ రాయ్‌ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని