logo

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో రాష్ట్ర లిఫ్టర్లకు పతకాలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతున్న ఖేలో ఇండియా-2023 యూత్‌ గేమ్స్‌లో సోమవారం నుంచి జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

Published : 07 Feb 2023 01:44 IST

పతకాలతో జోత్స్న సబర్‌, ప్రీతిశ్మిత భొయి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతున్న ఖేలో ఇండియా-2023 యూత్‌ గేమ్స్‌లో సోమవారం నుంచి జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళా లిఫ్టర్లు రెండు పతకాలు గెలుచుకున్నట్లు రాష్ట్ర లిఫ్టింగ్‌ కోచ్‌, అర్జున అవార్డు గ్రహీత కె.రవికుమార్‌ చెప్పారు. ఆయన సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు ఫోనులో ఆ వివరాలు తెలిపారు. తొలిరోజు పోటీల్లో మహిళల 40 కిలోల శరీరబరువు కేటగిరీలో జ్యోత్స్న సబర్‌ స్నాచ్‌లో 53 కిలోలు, క్లీన్‌జర్క్‌లో 65 కిలోలు బరువులెత్తి రజత పతకాన్ని గెలుచుకుందని చెప్పారు. ప్రీతిశ్మిత భొయి అనే మరో లిఫ్టరు స్నాచ్‌లో 53 కిలోలు, క్లీన్‌జర్క్‌లో 64 కిలోలు బరువులెత్తి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుందని రవికుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని