logo

జగన్నాథుని ‘ఖొసాపొడ’ గోప్యసేవలు

పూరీ శ్రీక్షేత్రంలో సోమవారం జగన్నాథునికి ‘ఖొసాపొడ’ గోప్యసేవలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు గర్భగుడి తలుపులు మూసేసి ఈ గోప్యసేవ చేశారు.

Published : 21 Mar 2023 03:16 IST

పురుషోత్తముని దివ్యమంగళ రూపం

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రంలో సోమవారం జగన్నాథునికి ‘ఖొసాపొడ’ గోప్యసేవలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు గర్భగుడి తలుపులు మూసేసి ఈ గోప్యసేవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం ఉదయం నుంచే ఈ విషయాన్ని మైకుల ద్వారా ప్రకటించి దర్శనాలు ఉండవని భక్తులకు తెలిపింది. పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు కర్రతో చేసినవి కావడంతో సంరక్షణకు కొన్ని రకాల లేపనాలు పూస్తారు. ఈ కార్యక్రమం అరుదుగా జరుగుతుంది. దీన్ని ‘ఖొసాపొడ’ సేవగా పేర్కొంటారు.


బడ్జెట్‌ రూపకల్పన... శ్రీక్షేత్ర యంత్రాంగం 2023-24 సంవత్సరం బడ్జెట్‌ పద్దుల రూపకల్పన చేసింది. ఈ ఏడాదిలో రూ.300.79 కోట్ల ఆదాయం, రూ.262.49 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్‌విక్రం సింగ్‌ యాదవ్‌ దీనిపై విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో పాలకవర్గం సమావేశం జరగనుందని, బడ్జెట్‌ పద్దులపై కూలంకష చర్చ తర్వాత అధికారికంగా తెలియజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని