logo

అధికారుల గదులకు తాళాలు

నవరంగపూర్‌ జిల్లాలో జడ్పీ కార్యాలయం ఆధ్వర్యంలో ఎలాంటి పనులు జరగలేదని, సమస్యలు చెప్పినా వినడం లేదని నందహండి సమితి సమితి జోన్‌-1 జడ్పీ సభ్యుడు దివ్యదాస్‌ సునా ఆరోపించారు.

Published : 04 Jun 2023 02:21 IST

అధ్యక్షుడి గదికి తాళం వేస్తున్న జడ్పీ సభ్యుడు దివ్యదాస్‌

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: నవరంగపూర్‌ జిల్లాలో జడ్పీ కార్యాలయం ఆధ్వర్యంలో ఎలాంటి పనులు జరగలేదని, సమస్యలు చెప్పినా వినడం లేదని నందహండి సమితి సమితి జోన్‌-1 జడ్పీ సభ్యుడు దివ్యదాస్‌ సునా ఆరోపించారు. రహదారి నిర్మాణానికి సంబంధించిన వినతి పత్రాలు డీపీఎం (జిల్లా ప్రొగ్రాం మేనేజర్‌) చించేశారన్న ఆగ్రహంతో దివ్యదాస్‌ శనివారం జడ్పీ అధ్యక్షుడు మోతీరామ్‌ నాయక్‌, డీపీఎం అమృత మహంతి గదులకు తాళం వేశారు. జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లే మార్గం చిత్తడిగా మారిందని మరమ్మతులు చేయించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. నాలుగు నెలలుగా వినతి పత్రాలు అందజేశామని, శుక్రవారం జరిగిన జడ్పీ సమావేశంలో మరోసారి అందజేయగా ఆ కాగితాలను చింపివేశారన్నారు. దాంతో గదులకు తాళాలు వేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ ‘సీడీవో’ (ఛీప్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) అన్యదాస్‌ను అడగ్గా, వినతిపత్రంలో తప్పులు ఉండటంతో డీపీఎం అలా చేశారని వెల్లడించారు. అధికారులు, జడ్పీ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని