logo

బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం

బ్రహ్మపుర సబ్‌కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది.

Published : 20 Apr 2024 02:59 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర సబ్‌కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. గోపాలపూర్‌్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థినిగా శుభస్మిత పాణిగ్రహి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె వెంట ఆ పార్టీ నాయకులున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఎఐఎఫ్‌బీ) గంజాం జిల్లా అధ్యక్షుడు బిభుదేంద్ర పాఢి చికిటి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దిగపొహండి అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా సిమాంచల డకువా నామినేషన్‌ దాఖలు చేశారు.


రెండో రోజూ బోణీ పడలేదు

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురంలో రెండో రోజు కూడా ఎవరూ నామినేషన్లు వేయలేదు. రెండు రోజుల్లో ఆరుగురు అభ్యర్థులు పత్రాలు తీసుకుని వెళ్లారు. గురువారం సత్యజిత్‌ గమాంగ్‌ (కాంగ్రెసు), రస్మితా కుమారి సబర, శుక్రవారం త్రినాథ్‌ గమాంగ్‌ (భాజపా), భాస్కర జగరంగా (కాంగ్రెసు రెబల్‌), అనాసిమి సబర (సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌), పద్మినీ గమాంగ్‌లు సబ్‌కలెక్టరు, ఎన్నికల అధికారి కిరణ్‌దీప్‌ కౌర్‌ సహొతా చేతుల మీదుగా పత్రాలు తీసుకున్నారు. శనివారం నుంచి నామినేషన్లు పడే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని