logo

ఏడుగురు అభ్యర్థులకు నేర చరిత్ర

ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్‌, కలహండి, కొరాపుట్‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Published : 05 May 2024 03:50 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్‌, కలహండి, కొరాపుట్‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ నాలుగు స్థానాలకు 37 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఏడుగురికి నేర చరిత్ర ఉందని, ఆరుగురిపై హత్యా అభియోగాలున్నాయని ఎలక్షన్‌ వాచ్‌ (ఏడీఆర్‌) ప్రతినిధి, ఐఏఎస్‌ మాజీ ఉన్నతాధికారి సహదేవ్‌ సాహు శనివారం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు. 37 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో ఏడుగురు కోటీశ్వరులు కాగా, కలహండి భాజపా అభ్యర్థి మాళవిక దేవి సంపద రూ.41.98 కోట్లుగా ఎన్నికల యంత్రాంగానికి సమర్పించిన ప్రమాణ పత్రంలో తెలిపారన్నారు. అభ్యర్థుల్లో ఒకరు స్కూలు గడప తొక్కలేదని, మరో ఆరుగురి విద్యార్హత 8, 10వ తరగతి లోపుగా ఉందన్నారు. మిగతా వారిలో డాక్టరేట్‌, పోస్ట్‌ గ్రాడ్యేయేషన్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందినవారు ఉన్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని