logo

గుంతలు తీశారు.. ప్రమాదాలకు వదలారు!

కొత్తవలసలోని ఉన్నత పాఠశాల మైదానం ముందున్న రహదారి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. బుధవారం ఈ రోడ్డులో ఓ ద్విచక్రవాహనం ఇరుక్కుపోయింది.

Published : 01 Jun 2023 04:34 IST

కొత్తవలసలోని ఉన్నత పాఠశాల మైదానం ముందున్న రహదారి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. బుధవారం ఈ రోడ్డులో ఓ ద్విచక్రవాహనం ఇరుక్కుపోయింది. కొత్తవలస నుంచి విజయనగరం వరకు ఉన్న రోడ్డు పక్కన కొన్ని నెలల కిందట ఓ టెలికాం కంపెనీ లైన్లు వేసే పనులు చేపట్టింది. అప్పట్లో తీసిన గుంతలు ఇంకా పూడ్చలేదు. దీంతో ద్విచక్ర వాహనదారుడు రోడ్డు పక్క నుంచి వెళ్తూ గుంతను గమనించక.. అందులో చిక్కుకుపోయాడు. అతని బైక్‌ ముందు భాగం అమాంతంగా గుంతలోకి వెళ్లిపోయింది. చోదకుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పూడ్చాల్సిన బాధ్యత సదరు సంస్థదేనని, వెంటనే పనులు చేయాలని ఆదేశిస్తామన్నారు.

న్యూస్‌టుడే, కొత్తవలస

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని