logo

విద్యుదాఘాతంతో రెండు గోవులు మృతి

మండలంలోని అంపావల్లి గ్రామం రాజు చెరువు పొదల్లో పైలెట్‌ ప్రాజెక్టుకు విద్యుత్తు సరఫరా చేస్తున్న ఎల్‌టీ న్యూట్రల్‌ వైరు తెగి భూమిపై పడింది.

Published : 04 May 2024 19:18 IST

బలిజిపేట: మండలంలోని అంపావల్లి గ్రామం రాజు చెరువు పొదల్లో పైలెట్‌ ప్రాజెక్టుకు విద్యుత్తు సరఫరా చేస్తున్న ఎల్‌టీ న్యూట్రల్‌ వైరు తెగి భూమిపై పడింది. ఈ సమయంలో గడ్డి పొదల్లో మేస్తున్న రెండు ఆవులు శనివారం సాయంత్రం విద్యుదాఘానికి గురై మృతి చెందాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన టొంపల రాంబాబు, అప్పారావులకు చెందిన సుమారు రూ.70వేలు విలువైన ఆవులు మృతి చెందాయని బాధితరైతులు తెలిపారు. విద్యుత్తు లైను తెగినందున ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. ఈ అంశంపై ట్రాన్స్‌కో ఏఈ సింహాచలాన్ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, తాగునీటి సరఫరా పథకానికి వెళ్తున్న వైర్లలో న్యూట్రల్‌ వైరు దట్టంగా ఉన్న గడ్డి పొదల్లో తెగినందున తెలియలేదని, దీంతో ప్రమాదం జరిగిపోయిందన్నారు. ఫేజు వైరు తెగితేనే మంట వస్తుందని, ఈ విషయం తెలిసిన వెంటనే సవరించామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని