logo

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వసతులు

పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 28 Mar 2024 04:24 IST

ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలను పరిశీలిస్తున్న కలెక్టరు, నాలుగు నియోజకవర్గాల ఎన్నికల అధికారులు

పార్వతీపురం, గరుగుబల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో కలసి ఓట్ల లెక్కింపు కేంద్రంగా గుర్తించిన ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలను కలెక్టరు బుధవారం సందర్శించారు. ఈ కేంద్రంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్‌ ఓట్లను లెక్కించనున్నామని, వీటికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలు ఉద్యాన కళాశాల వద్ద ఏర్పాటు చేసే రిసెప్షన్‌ కేంద్రానికి చేరాలన్నారు. ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్‌ రూంల దగ్గర అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. పాలకొండ, పార్వతీపురం, సాలూరు ఎన్నికల అధికారులు కల్పనాకుమారి, కె.హేమలత, సి.విష్ణుచరణ్‌, కురుపాం ఆర్వో వెంకటరమణ, సంయుక్త కలెక్టరు శోభిక, డీఆర్వో కేశవనాయుడు, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఎంవీఆర్‌ కృష్ణాజీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని