logo

సచివాలయం ఉద్యోగులు అందుబాటులో ఉండాలి

బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు.

Published : 28 Mar 2024 18:45 IST

బలిజిపేట: బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ సచివాలయంలో పనిచేస్తున్న ప్రధానశాఖల ఉద్యోగులెవ్వరూ ఇక్కడకు సక్రమంగా హాజరుకాకుండా విధులకు గైర్హాజరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం ఇక్కడ పనిచేసిన ఉద్యోగుల్లో ఇద్దరు బలిజిపేట తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సమావేశానికి వెళ్లగా, మిగతా సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో ఈ సచివాలయం కుర్చీలన్నీ ఖాళీగానే కన్పిస్తున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కూడా ప్రజలు వాట్సాప్‌ ద్వారా మీడియాకు గురువారం పంపించారు. గ్రామంలోని ప్రజలకు పంచాయతీ కార్యదర్శి ఎవరో తెలియదన్నారు. ఈ అంశంపై ఎంపీడీవో రమేష్‌నాయుడును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, వారానికొకరోజు సచివాలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గతవారం వంతరాం సచివాలయానికి వెళ్లామని, కొంతమంది సిబ్బంది ఆలస్యంగాను, కొంతమంది గైర్హాజరవుతున్నట్టు తేలిందన్నారు. వీరిని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని