logo

ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు

ప్రజలు ప్రస్తావించిన సమస్యలు, ఫిర్యాదులను నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌

Published : 18 Jan 2022 02:39 IST


ఫోన్‌ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌..
చిత్రంలో జేసీలు చేతన్, విశ్వనాథన్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలు ప్రస్తావించిన సమస్యలు, ఫిర్యాదులను నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలను విన్న ఆయన వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జేసీలు చేతన్, విశ్వనాథన్, డీఆర్వో పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 
* అద్దంకి మండలం కొటికలపూడి ఎన్నెస్పీ కాలువ భూములను కొందరు ఆక్రమించి దుకాణాలు నిర్మించారని అదే గ్రామానికి చెందిన వేణు ఫిర్యాదు చేశారు. అద్దంకి తహసీల్దార్, ఎన్నెస్పీ డీఈతో కలెక్టర్‌ వెంటనే ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. 
* సింగరాయకొండలో జనావాసాల మధ్య ప్రైవేట్‌ వ్యక్తులు పశువుల సంత నిర్వహిస్తుండటంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని.. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అబ్దుల్‌ ఖాదర్‌ ఫిర్యాదు చేశారు.
* పుల్లలచెరువు మండలం గంగవరానికి చెందిన పార్వతి తన తాత పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని 2019లో అప్పటి తహసీల్దార్‌ ఇతరుల పేరు మీద ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని మార్కాపురం ఆర్డీవోను కలెక్టర్‌ ఆదేశించారు. 
* మురుగు నీటి సమస్యతో పాటు పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నామని ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్ట సమీపంలోని లింగారెడ్డి కాలనీకి చెందిన రవికుమార్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని