logo

పాలనా దక్షతకు నిదర్శనం టంగుటూరి

టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. టంగుటూరి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని విగ్రహానికి శుక్రవారం ఉదయం కలెక్టర్‌తో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి

Published : 21 May 2022 06:30 IST


ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. టంగుటూరి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని విగ్రహానికి శుక్రవారం ఉదయం కలెక్టర్‌తో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జేసీ అభిషిక్త్‌ కిషోర్, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వీసీ జయరామిరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ధైర్యం, త్యాగం, పరిపాలనా దక్షతకు ప్రకాశం పంతులు నిదర్శనమన్నారు. ఆయన చూపిన మార్గంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపాలకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో పులి శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, ఒంగోలు కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

మంత్రులకు పట్టని ప్రకాశం
టంగుటూరి వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రులు విస్మరించడం చర్చనీయాంశమైంది. ఒంగోలులోని కలెక్టరేట్‌లో ఉదయం అధికారులు, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఉదయం 11 తర్వాత ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. సమావేశం అనంతరం ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రులు నివాళులర్పిస్తారన్న ఉద్దేశంతో అధికారులు పూలమాలలు తెప్పించారు. అయితే వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. కనీసం విగ్రహం వైపు కన్నెత్తి చూడలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని