logo

దొంగ బంగారం.. ఒంగోలులో కలకలం

ఒంగోలు నగరంలో కొందరు వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి దొంగ బంగారం తీసుకొచ్చి విక్రయిస్తున్న దాఖలాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో కొందరు వ్యాపారులు రూ.5 కోట్ల నగదుతో గుమ్మిడింపూడి సమీపంలో తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డారు. 

Published : 25 Jun 2022 03:15 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో కొందరు వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి దొంగ బంగారం తీసుకొచ్చి విక్రయిస్తున్న దాఖలాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో కొందరు వ్యాపారులు రూ.5 కోట్ల నగదుతో గుమ్మిడింపూడి సమీపంలో తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డారు. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించడమే గాక రాజకీయంగా దుమారం సృష్టించింది. తాజాగా మరో ఉదంతం వెలుగుచూసింది. ఒంగోలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమిళనాడులోని మన్నడి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది హవాలా డబ్బుగా గుర్తించి బి-1 నార్త్‌కోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తరిలించి విచారణ చేపట్టారు. పట్టుబడినవారిలో ఒంగోలు దక్షిణం బజారుకు చెందిన వ్యక్తితోపాటు కేశవస్వామిపేటకు చెందిన డ్రైవర్‌ ఉన్నారు. ప్రధాన నిందితుడు దక్షిణం బజారులో మిఠాయి దుకాణం నిర్వహిస్తున్నారు. తరచూ తమిళనాడుకు వెళ్లి అక్కడ హోల్‌సేల్‌గా బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి ఒంగోలులో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇది నిత్యం జరిగే తంతుగా మారింది. ఎప్పటి మాదిరిగానే వెళ్లిన క్రమంలో అక్కడి పోలీసులకు అందిన సమాచారంతో నిందితులు పట్టుబడ్డారు.

ఇంకా మరికొందరు...

ఈ మొత్తం వ్యవహారం ఒంగోలు వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వ్యాపారంలో సాధారణ లావాదేవీలు నిర్వహించాలంటే దానికి తగిన పద్ధతి పాటించాలి. ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంది. ఇది తమకు నష్టంగా మారుతుందని భావించి కొందరు ఈ తరహాలో దొంగ బంగారం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒంగోలులో ఇలా 10 మంది వ్యక్తులు నిత్యం తమిళనాడు నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని