logo

కక్ష గట్టి ఉద్యోగం నుంచి తొలగించారు..

ఇటీవల వైకాపా ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభపై ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి మాట్లాడిన ప్రసంగాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశానన్న ఆరోపణలతో మీటర్స్‌ రీడర్స్‌గా విధులు నిర్వహిస్తున్న తనను వైకాపా

Published : 09 Aug 2022 01:43 IST

స్పందనలో తెదేపా సానుభూతిపరుడి ఆవేదన

దరఖాస్తుదారులతో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి

మార్కాపురం, న్యూస్‌టుడే: ఇటీవల వైకాపా ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభపై ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి మాట్లాడిన ప్రసంగాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశానన్న ఆరోపణలతో మీటర్స్‌ రీడర్స్‌గా విధులు నిర్వహిస్తున్న తనను వైకాపా నాయకులు కక్ష కట్టి విధుల నుంచి తొలగించారని పెద్దారవీడు మండలంలోని తమ్మడపల్లె గ్రామానికి చెందిన తెదేపా సానుభూతి  నక్కా శ్రీను స్పందనలో ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి ఎదుట వాపోయాడు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ స్పందనలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డితో కలిసి వినతిపత్రాన్ని నక్కా శ్రీను ఆర్డీవోకి అందజేశారు  పూర్తి స్థాయిలో విచారణ చేసి చిరు ఉద్యోగినైనా తనకు న్యాయం చేయాలని కోరారు. మండలంలోని నికరంపల్లె గ్రామానికి చెందిన జంకె వెంకటరెడ్డి అనే రైతు తన భూమి వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గొట్టిపడియ నిర్వాసిత కాలనీకి తీసుకుందని, అయితే అప్పట్లో అధికారులు తన భూమిని ఆన్‌లైన్‌ చేయకపోవడం వల్ల మరొక రైతు పేరున ప్రాజెక్టు అధికారులు ఇచ్చిన పరిహారం అవార్డును మంజూరు చేశారని, అయితే ఆ పరిహారం తనకు మంజూరు చేయాలని ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 12 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో కార్యాలయ అధికారులు తెలిపారు.  స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దారు ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని