logo

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి

పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ద్వారా మానసిక సాంత్వన కలుగుతుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటవిడుపు కోసం భారీ

Published : 28 Sep 2022 02:25 IST

విద్యార్థినికి ప్రశంసా పత్రం అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌.. చిత్రంలో పర్యాటకశాఖ 

   అధికారి బెనహర్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ద్వారా మానసిక సాంత్వన కలుగుతుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటవిడుపు కోసం భారీ వ్యయ ప్రయాసలతో దూర ప్రాంతాలకే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలోను, రాష్ట్రంలో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు, మానవ నిర్మిత కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. ‘పర్యాటకంపై పునరాలోచన’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు పర్యావరణానికి, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా చూడాలన్నారు. అక్కడి విశేషాలను ఇతరులకు తెలియజేసి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగస్వాములను చేయడమే దీని నేపథ్యమన్నారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి బెనహర్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, జిల్లా నెహ్రూ యువజన అధికారి కమల్‌సా తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని