logo

స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం తోడ్పాటు

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘జగనన్న బడుగు వికాసం’ పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 02:16 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘జగనన్న బడుగు వికాసం’ పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. పథకం కింద ఎంపికైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 45 శాతం రాయితీపై ప్రభుత్వం మంజూరు చేసిన మూడు కార్లు, రెండు మినీ ట్రక్కులను శనివారం పంపిణీ చేశారు. అర్హులైనవారు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, ఎల్‌డీఎం యుగంధర్‌, డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు