logo

ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం

స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు.

Published : 20 Apr 2024 02:59 IST

అవగాహన ర్యాలీలో భాగంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న జిల్లా అధికారులు, ఉద్యోగులు, కార్మికులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. మే 13న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరూ తమ హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా కార్మికులతో ప్రతిజ్ఞతో పాటు, మానవహారం ఏర్పాటు చేశారు. తొలుత ఓటు వినియోగంపై వినూత్నంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో స్వీప్‌ జిల్లా సమన్వయకర్త వీఎస్‌.జ్యోతి, పరిశ్రమల కేంద్రం జీఎం బి.శ్రీనివాసరావు, ఏపీఐఐసీ మేనేజర్‌ నాగుల్‌మీరా, కార్మిక శాఖ అధికారి ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని