logo

ఉద్యోగ విరమణ వయసు పెంపుతో అన్యాయం

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజేంద్రబాబు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీపీఐ

Published : 23 Jan 2022 03:52 IST

మాట్లాడుతున్న రాజేంద్రబాబు, చిత్రంలో ఇతర నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజేంద్రబాబు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని ఫిబ్రవరి 10న కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్‌, జనసేన నాయకులు రామ్మోహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరీష్‌కుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని