logo

జేఈఈలో సిక్కోలు సత్తా..

జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు.

Published : 26 Apr 2024 03:47 IST

'కలెక్టరేట్‌(శ్రీకాకుళం), జలుమూరు, న్యూస్‌టుడే: జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు. వారి వివరాలు ఇలా..

ఐటీడీఏ సూపర్‌ 60 కళాశాల విద్యార్థుల ప్రతిభ.. శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఐటీ సూపర్‌ 60 కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. 21 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు కోర్స్‌ డైరెక్టర్‌ మురళీబాబు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఐటీడీఏ పీవో శుభం భన్సల్‌ అభినందించారు. అడ్వాన్స్‌ పరీక్షలోనూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

సార్వత్రిక పాఠశాల ఫలితాలు విడుదల.. కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సార్వత్రిక పాఠశాల ద్వారా నిర్వహిస్తున్న పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. పదోతరగతి పరీక్షలకు 767 మంది హాజరవగా 280 మంది (36.51 శాతం) ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.  ఇంటర్‌కు 1705 మంది హాజరవగా 561 మంది (32.9 శాతం) ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఫలితాల్లో పదో తరగతిలో 17వ స్థానం, ఇంటర్‌లో 23వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు