logo

ఆ గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతనే..

రణస్థలం నుంచి వేణుగోపాలపురం, నాగంపాలెం, పిట్టపాలెం, గుమ్మడాం గ్రామాలకు వెళ్లే మట్టిరోడ్డు వర్షం పడితే ఇలా బురదమయంగా మారుతోంది. రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 17 Aug 2022 06:38 IST

రణస్థలం నుంచి వేణుగోపాలపురం, నాగంపాలెం, పిట్టపాలెం, గుమ్మడాం గ్రామాలకు వెళ్లే మట్టిరోడ్డు వర్షం పడితే ఇలా బురదమయంగా మారుతోంది. రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నేళ్లు గడిచినా పక్కా రహదారి మాత్రం ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ పీఐయూ విభాగం ఏఈఈ హేమలత వద్ద ప్రస్తావించగా రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.1.60 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైన వెంటనే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- న్యూస్‌టుడే, లావేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని