logo

ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి : ఎల్‌ మురుగన్‌

దేశ భక్తి ఉన్న ప్రతి ఒక్కరు వారి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని కేంద్ర సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ తెలిపారు. శనివారం కోయంబత్తూరు స్వామి వివేకానందా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ రన్‌

Published : 14 Aug 2022 00:16 IST

విద్యార్థులతో కేంద్ర సహాయ మంత్రి

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: దేశ భక్తి ఉన్న ప్రతి ఒక్కరు వారి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని కేంద్ర సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ తెలిపారు. శనివారం కోయంబత్తూరు స్వామి వివేకానందా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ రన్‌ కార్యక్రమాన్ని నవ ఇండియా ప్రాంతంలోని హిందుస్థాన్‌ ప్రైవేటు కళాశాలలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ ప్రారంభించారు. విద్యార్థులు జాతీయ జెండా పట్టుకొని కేంద్ర సహాయ మంత్రితో ఫొటో తీసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రధాని అభ్యర్థన మేరకు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందే దేశంగా భారత్‌ ఉందని, అబ్దుల్‌ కలాం కలలు కన్న విధంగా 2047 నాటికి దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని