logo

ఆస్పత్రికి సీల్‌

బాలిక పిండం చట్ట విరుద్ధంగా విక్రయించిన విషయంలో సేలంలోని సుధా ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేశారు. 16 ఏళ్ల బాలిక పిండం విక్రయంలో సంబంధం ఉన్న ఆస్పత్రులను సీజ్‌ చేసే చర్యలు చేపడుతున్నారు.

Published : 14 Aug 2022 00:16 IST

ఆస్పత్రి తాళాలను అధికారులకు అప్పగిస్తున్న దృశ్యం

సేలం, న్యూస్‌టుడే: బాలిక పిండం చట్ట విరుద్ధంగా విక్రయించిన విషయంలో సేలంలోని సుధా ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేశారు. 16 ఏళ్ల బాలిక పిండం విక్రయంలో సంబంధం ఉన్న ఆస్పత్రులను సీజ్‌ చేసే చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం సేలం కొత్త బస్టాండు వద్ద ఉన్న సుధా ఆస్పత్రికి జిల్లా వైద్యశాఖ జాయింట్‌ డైరక్టరు నెడుమారన్‌ శనివారం సీల్‌వేశారు. సేలం సుధా ఆస్పత్రి అనుమతిని రద్దు చేసి, స్కాన్‌ సెంటర్‌కి మాత్రమే గత నెల సీల్‌ వేశారు. ఆ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రికి సీల్‌ వేయడానికి సమయం ఇచ్చారు. రోగులందరూ డిశ్చార్జ్‌ అవడంతో సీల్‌ వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని