logo

విద్వేష శక్తులకు ఇక్కడ చోటులేదు: సీఎం

విద్వేష శక్తులకు రాష్ట్రంలో చోటులేదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎగ్మూరులోని ప్రభుత్వ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం గవర్నర్‌ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పుష్పాంజలి ఘటించారు.

Published : 03 Oct 2022 00:36 IST

గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన గవర్నర్‌ రవి, సీఎం స్టాలిన్‌ తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: విద్వేష శక్తులకు రాష్ట్రంలో చోటులేదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎగ్మూరులోని ప్రభుత్వ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం గవర్నర్‌ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు, మేయర్‌ తదితరులు కూడా నివాళి అర్పించారు. సర్వోదయ సంఘం విద్యార్థులు నిర్వహించిన భజన, రాట్నంలో నూలు వడికే ప్రదర్శనను గవర్నర్‌, సీఎం తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ ట్వీట్‌ చేశారు. విభేదాలు అధిగమించి ప్రేమ, శాంతిని వెలుగొందించే సమాజంగా భారత్‌ను రూపొందించడానికి మహాత్మాగాంధీ కృషి చేశారని తెలిపారు. ఆయన జయంతి రోజు ఈ గడ్డపై సమానత్వం, సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించారు. విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు ఇక్కడ చోటులేదన్నారు. ఇది గాంధీ నేలగా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని గ్రామోద్యోగ్‌ భవన్‌లో ఉన్న గాంధీ చిత్రపటానికి గవర్నర్‌ నివాళి అర్పించారు. తర్వాత ఖాదీ చీరల విక్రయాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి గాంధీ తదితరులు పాల్గొన్నారు. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో గాంధీ చిత్రపటానికి గవర్నర్‌ రవి, ఆయన సతీమణి లక్ష్మీ నివాళి అర్పించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని