logo

అన్నాడీఎంకే నిర్వాహకుడి కోసం గాలింపు

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అయ్యే పూర్తి ఖర్చు భరించాలని హోటల్‌ మేనేజర్‌ను బెదిరించిన పార్టీ నిర్వాహకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Published : 03 Oct 2022 00:36 IST

చెన్నై, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అయ్యే పూర్తి ఖర్చు భరించాలని హోటల్‌ మేనేజర్‌ను బెదిరించిన పార్టీ నిర్వాహకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాయపేటలోని జహాని జహాన్‌ రోడ్డులో ఎస్‌ఎస్‌ హైదరాబాద్‌ బిర్యానీ దుకాణం కొనసాగుతోంది. రెండు వారాల కిందట అన్నాడీఎంకే వార్డు కార్యదర్శి శ్రీనివాసన్‌ ఆ దుకాణానికి వెళ్లి తమ పార్టీ సర్వసభ్య సమావేశానికి అయ్యే పూర్తి ఖర్చును భరించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఫోన్‌కాల్‌ ద్వారా మేనేజర్‌ను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆడియోను రాయపేట పోలీసులకు మేనేజర్‌ అందించి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నార

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని