logo

మహిళ ఆత్మహత్య కేసులో ఆరోపణలు...

పుదుక్కోట జిల్లా కీరమంగళం సమీపం మేర్పనైక్కాడు ఉత్తర గ్రామానికి చెందిన నీలకంఠన్‌ భార్య కోకిల (36) ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొంది. అంతకుముందు ఆమె ఒక లేఖ రాసింది. తనపై తప్పుడు కేసు బనాయించి వేకువజామున కోర్టుకు తీసుకెళ్లారని

Published : 04 Oct 2022 04:10 IST

ముగ్గురు పోలీసుల బదిలీ

కోకిల (పాత చిత్రం)

వేలచ్చేరి, న్యూస్‌టుడే: పుదుక్కోట జిల్లా కీరమంగళం సమీపం మేర్పనైక్కాడు ఉత్తర గ్రామానికి చెందిన నీలకంఠన్‌ భార్య కోకిల (36) ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొంది. అంతకుముందు ఆమె ఒక లేఖ రాసింది. తనపై తప్పుడు కేసు బనాయించి వేకువజామున కోర్టుకు తీసుకెళ్లారని, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అందులో ఉంది. నీలకంఠన్‌ ఫిర్యాదు మేరకు డీఎంకే నాయకుడు ఎం.ఎం.కుమార్‌, అతని భార్య భవనేశ్వరి, కీరమంగళం పోలీసు ఎస్సై జయకుమార్‌, మహిళా పోలీసు క్రేసీ, దురైమాణిక్యం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసేంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని ఆదివారం కోకిల బంధువులు ఆందోళన చేపట్టారు. అరంతాంగి ఆర్డీఓ సొర్ణరాజ్‌ విచారణ చేయడానికి వెళ్లగా నిందితులను అరెస్టు చేసే వరకు కుదరని తెలిపారు. చర్చల తర్వాత మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, వారికి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎస్సై జయకుమార్‌, క్రేసీ, కామరాజ్‌ను వేర్వేరు స్టేషన్లకు బదిలీ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని