logo

అన్నాడీఎంకే వ్యవహారాల్లో జోక్యం చేసుకోం: అన్నామలై

అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు.

Published : 05 Feb 2023 00:58 IST

మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. ఈరోడ్‌ ఉప ఎన్నికలకు సంబంధించి ఆయన చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో  సీనియర్‌ నేతలతో శనివారం సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈరోడ్‌ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తుతో పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీరుసెల్వంతో గతంలో సమావేశమైనప్పడు కలిసి ఉండాలని హితవు పలికినట్లు తెలిపారు. ఉప ఎన్నికల అంశానికి సంబంధించి అన్నాడీఎంకే, తమ పార్టీ మధ్య విభేదాలు తారస్థాయి చేరుకున్నాయని వెలువడుతున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 39 స్థానాల్లో గెలుపొందడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దీని కోసం పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని