logo

మహిళలకు రాష్ట్రం సురక్షితం

 మహిళలకు అత్యంత సురక్షితంగా రాష్ట్రం ఉందని డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు.

Updated : 30 Mar 2023 06:17 IST

మాట్లాడుతున్న డీజీపీ శైలేంద్ర బాబు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మహిళలకు అత్యంత సురక్షితంగా రాష్ట్రం ఉందని డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా నేరాలను అడ్డుకొని నవ భారతాన్ని సృష్టిద్దామనే అవగాహన కార్యక్రమం చెన్నై నుంగంబాక్కంలో ఉన్న లయోలా కళాశాలలో జరిగింది. దీన్ని డీజీపీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థినులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు జరిగాయి. విజేతలకు డీజీపీ బహుమతులు అందించి, అభినందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....పుస్తకం, కలం మాత్రమే మహిళలకు సురక్షితమైన ఆయుధాలన్నారు. దేశంలో మహిళలకు సురక్షితమైన రాష్ట్రం తమిళనాడు అని ఓ అధ్యయనంలో తెలిసిందన్నారు.  వారికి సంబంధించిన కేసుల్లో వెంటనే తగిన చర్యలు చేపట్టి కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా చేస్తున్నట్లు తెలిపారు.  మహిళలు తమ వ్యక్తిగత రహస్యాలు, సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోకూడదని,  ఎవరైనా బెదిరింపులకి పాల్పడితే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇలాంటి నేరాలను విచారించేందుకు సైబర్‌ క్రైం విభాగం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారుల భద్రతా విభాగ అదనపు డీజీపీ కల్పన నాయక్‌, డిప్యూటీ¨ కమిషనరు వనిత, సహాయ కమిషనరు కలైసెల్వన్‌ పాల్గొన్నారు.
  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని