logo

ముడి సరకుల తయారీపై పరిశోధన

పంట వ్యర్థాలతో ‘ఎకో ఫ్రెండ్లీ’ సాంకేతికత ద్వారా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే ముడి సరకులను తయారు చేసేందుకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీ ఎం) పరిశోధకులు ఆలోచనలు ప్రారంభించారు.

Updated : 30 Mar 2023 06:27 IST

కార్బన్‌ గుళికలు

వడపళని, న్యూస్‌టుడే:పంట వ్యర్థాలతో ‘ఎకో ఫ్రెండ్లీ’ సాంకేతికత ద్వారా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే ముడి సరకులను తయారు చేసేందుకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీ ఎం) పరిశోధకులు ఆలోచనలు ప్రారంభించారు. ఈ విధానంతో రైతులు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాలున్నాయి. సేంద్రియ వ్యర్థాలు, పంట వ్యర్థాలతో వెలువడే కార్బన్‌ నుంచి పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే ముడి సరకును తయారు చేసేందుకు ‘ఫార్మ్‌ ఎనర్జీ సినర్జీ’ విధానంతో పరీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 760 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. వ్యర్థాలను తగులబెట్టడంతో పర్యావరణం కాలుష్యమవుతోంది. బయో వ్యర్థాలను బయోమాస్‌ (కాయగూరల వ్యర్థాలు వంటివి)గా మార్చడంపై ఐఐటీఎం పరిశోధకులు ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చారు.  అదే సాంకేతికతతో వరి వ్యర్థాల నుంచి ఉపయోగపడే కార్బన్‌ ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభించారు. ఐఐటీ అలూమ్ని అండ్‌ కార్పొరేట్‌ రిలేషన్స్‌ డీన్‌, ఆచార్యులు మహేష్‌ పంచగ్నుల మాట్లాడుతూ... కొత్త పరిశోధనల ద్వారా పారిశ్రామిక రంగానికి ఎలా ఉపయోగకరంగా ఉంటుందో వివరించారు. ఐఐటీ మెటలర్జికల్‌, మెటీరియల్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టిజు థామస్‌ ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్టు పనులు చూస్తోంది. సీఎస్సార్‌ భాగస్వామ్యం వహిస్తే ప్రాజెక్టుతో దేశానికి ప్రయోజనం చేకూరే వీలుంటుందని థామస్‌ అన్నారు.

సూపర్‌ కెపాసిటర్‌ మాడ్యూల్‌ కోసం హార్డ్‌వేర్‌తో పరీక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని