logo

మెట్రో స్టేషనులో అదనపు వసతులు

మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం పురట్చి తలైవర్‌ డాక్టర్‌ ఎంజీ రామచంద్రన్‌ సెంట్రల్‌ మెట్రో స్టేషనులో శుక్రవారం అదనపు వసతులను సీఎంఆర్‌ఎల్‌ ప్రవేశపెట్టింది.

Published : 01 Apr 2023 05:34 IST

బాలింతలకు ప్రత్యేక గది

వడపళని, న్యూస్‌టుడే: మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం పురట్చి తలైవర్‌ డాక్టర్‌ ఎంజీ రామచంద్రన్‌ సెంట్రల్‌ మెట్రో స్టేషనులో శుక్రవారం అదనపు వసతులను సీఎంఆర్‌ఎల్‌ ప్రవేశపెట్టింది. 1, 2 ప్లాట్‌ఫారాల్లో అదనంగా రెండు ఎస్కలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. పలు మెట్రో స్టేషన్లలో అదనంగా 41 ఎస్కలేటర్లున్నాయి. అదేవిధంగా సెంట్రల్‌ మెట్రో స్టేషనుతో పాటు వడపళని, ఎగ్మూరు, పురట్చి తలైవి డాక్టర్‌ జయలలిత సీఎంబీటీ మెట్రో, వాషర్‌మెన్‌పేట మెట్రో స్టేషన్లలో మదర్‌ ఫీడింగ్‌ గదులు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్‌, వింకోనగర్‌ మెట్రో స్టేషన్లలో ఇప్పటికే ఫీడింగ్‌ గదులున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన గదుల్లో కూర్చునేందుకు వీలుగా కుర్చీలు,  డైపర్లు మార్చుకునేందుకు సదుపాయం, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేశారు. తల్లీబిడ్డల సంక్షేమం దృష్ట్యా ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తుంటామని పేర్కొన్నారు.


కార్యదర్శికి వీడ్కోలు

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి గ్రామస్థులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. కొత్తగుమ్మిడిపూండి పంచాయతీ కార్యదర్శిగా చిట్టిబాబు ఆరేళ్లుగా పని చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు పొందారు. ఆయన నేమలూరుకు బదిలీ కావడంతో శుభ్రత కార్మికులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని