logo

Rajinikanth:‘సంఘి’ అంటే తప్పు మాట కాదు: రజనీకాంత్

‘సంఘి’ అంటే తప్పుమాట కాదని, తన కుమార్తె కరెక్టుగానే మాట్లాడిందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు. రజనీకాంత్‌ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’.

Updated : 30 Jan 2024 14:14 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘సంఘి’ అంటే తప్పుమాట కాదని, తన కుమార్తె కరెక్టుగానే మాట్లాడిందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు. రజనీకాంత్‌ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం కొన్నిరోజుల క్రితం చెన్నైలో జరిగింది. అందులో భాగంగా రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘మా నాన్న సంఘి కాదు. సంఘి అంటే ఏదో ఒక పార్టీకి, మతానికి మాత్రమే మద్దతుగా వ్యవహరిస్తారనే అర్థం అని తెలిసింది. అలా అయితే మా నాన్న సంఘి కాదు. అలాంటి వ్యక్తిత్వమే అయితే నా ‘లాల్‌ సలామ్‌’లో నటించేవారు కాద’ని చెప్పారు. దీనిపై పలువురు రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం రజనీకాంత్‌ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నా కుమార్తె కరెక్టుగానే మాట్లాడారు. ఆమె అభిప్రాయంలో ఎలాంటి పొరబాటు లేదు. అంతేకాకుండా సంఘి అంటే తప్పుమాట కాద’ని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని