logo

ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్

ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని మంత్రి అనితా రాధాకృష్ణన్‌ విమర్శించారు.

Updated : 19 Mar 2024 08:51 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని మంత్రి అనితా రాధాకృష్ణన్‌ విమర్శించారు. కన్నియాకుమరిలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. రామేశ్వరం వచ్చే భాజపా నేతలు, మంత్రులు కచ్ఛదీవిని, లంక ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పడవలను తిరిగి పొందుతామని చెబుతూ మోసం చేస్తున్నారన్నారు. కన్నియాకుమరిలో మాట్లాడిన ప్రధాని.. జాలర్లకు డీఎంకే, కాంగ్రెస్‌ ఏమీ చేయలేదన్నారని, భాజపా ఎంతమందిని కాపాడిందో లెక్కలు చూపితే దానికి జవాబు ఇస్తామన్నారు. సముద్రంలో చిక్కుకునే జాలర్లను కాపాడేందుకు హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నామని, అది ఇంకా నెరవేరలేదన్నారు. అన్ని సముద్రతీరాల్లో జాలర్లను కాపాడేందుకు బోట్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, వచ్చే బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయిస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని