logo

శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు

శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది.

Published : 19 Apr 2024 00:09 IST

 

నళిని కృపాకరన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. ఇందులో నళిని కృపాకరన్‌(38) అనే మహిళ ఎన్నికల కమిషన్‌ వద్ద ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు కార్డ్డుకు దరఖాస్తు చేసుకుని పొందారు. శుక్రవారం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయనున్నట్లు సమాచారం వెల్లడైంది. ఆమె శ్రీలంక తమిళురాలు కావడంతో ఓటు హక్కు లేదని, భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడి పౌరహక్కు లేనివారికి ఓటరుకార్డు ఇవ్వడం కుదరదని కలెక్టర్‌ తెలిపారు. పొరపాటున ఆమెకు ఇచ్చిన ఓటరు కార్డు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని