logo

ఏర్కాడులో బస్సు బోల్తా

సేలం జిల్లాలోని పర్యాటక ప్రదేశమైన ఏర్కాడు కొండ ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అయిదుగురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు.

Published : 01 May 2024 00:53 IST

అయిదుగురి దుర్మరణం
సుమారు 50 మందికి గాయాలు

ఘటనాస్థలి వద్ద దృశ్యాలు

సేలం, న్యూస్‌టుడే: సేలం జిల్లాలోని పర్యాటక ప్రదేశమైన ఏర్కాడు కొండ ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అయిదుగురు మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు మంగళవారం 60 మంది ప్రయాణికులతో ఏర్కాడు కొండ ప్రాంతం నుంచి సేలం వైపు బయల్దేరింది. మునియప్పన్‌ ఆలయం వద్ద మలుపులో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో మునీశ్వరన్‌(11), కార్తీ(37), హరిరాం(57), కుమార్‌(35), 45 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి దుర్మరణం చెందారు. 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సేలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోయలోపడే సమయంలోనే పలువురు కిటికీల్లోంచి జారిపడ్డారు.

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

వాహనంలో క్షతగాత్రుల తరలింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని