logo

కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్‌ఫ్లూ

కేరళలో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Published : 01 May 2024 01:13 IST

రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలు

రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను పరిశీలిస్తున్న ఆరోగ్యశాఖ బృందం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: కేరళలో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత నెల నుంచి కేరళ నుంచి కోళ్లు, పక్షులను తరలిస్తున్న వాహనాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర సరిహద్దులోకి అనుమతిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ జిల్లా ఆరోగ్య విభాగ డైరెక్టర్లకు కొన్ని సూచనలు చేసింది. కేరళ రాష్ట్రం నుంచి కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చే వాహనాలను అనుమతించకూడదని, వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తే వారికి వెంటనే చికిత్స అందించాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని