logo

సవుక్కు శంకర్‌పై మరో రెండు కేసులు

యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను కోయంబత్తూరు పోలీసులు ఇదివరికే అరెస్టు చేశారు.

Published : 09 May 2024 00:41 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను కోయంబత్తూరు పోలీసులు ఇదివరికే అరెస్టు చేశారు. గంజాయికి సంబంధించి తేని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమిళగ మున్నేట్రపడై వ్యవస్థాపక అధ్యక్షురాలు వీరలక్ష్మి.. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సవుక్కు శంకర్‌, ఫెలిక్స్‌లపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సీసీబీ, సైబర్‌ క్రైం పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. సీనియర్‌ మహిళా జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీబీ, సైబర్‌ క్రైం పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో సవుక్కు శంకర్‌ని చెన్నై పోలీసులు త్వరలో అరెస్టు చేయనున్నారు.

తిరుచ్చిలోనూ.. సైదాపేట: తిరుచ్చిలో కొత్తగా సవుక్కు శంకర్‌పై ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు ఆధారాలు కూడా సిద్ధం చేశారు.

15 రోజుల రిమాండ్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌కి 15 రోజుల రిమాండ్‌ విధిస్తూ మదురై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గంజాయి స్వాధీనం చేసుకున్న కేసులో మదురై మత్తుపదార్థాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో సవుక్కు శంకర్‌ని బుధవారం పోలీసులు హాజరుపరిచారు. అప్పుడు అతనికి 15 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని