logo

ఇరాన్‌ నుంచి కొచ్చికి..

ఇరాన్‌ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్‌గార్డ్‌ రక్షించింది.

Published : 09 May 2024 00:49 IST

పడవలో వచ్చిన తమిళ జాలర్లు
కాపాడిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఇరాన్‌ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్‌గార్డ్‌ రక్షించింది. రామనాథపురానికి చెందిన దయాళన్‌, అరుణ్‌ దయాళన్‌, కలైదాస్‌, రాజేంద్రన్‌, మునీశ్వరన్‌, కన్నియాకుమరికి చెందిన మరియడేనియస్‌ తదితరులు 2023లో ఇరాన్‌కి ఒప్పంద కార్మికులుగా చేపలు పట్టేందుకు వెళ్లారు. వారికి యజమాని సయ్యద్‌ జావూద్‌ జాఫ్రియన్‌ వేతనం ఇవ్వకుండా బానిసలుగా చేసినట్లు తెలిసింది. వారు 15 రోజుల కిందట సయ్యద్‌ జావూద్‌ జాఫ్రిన్‌ పడవలో ఇరాన్‌ నుంచి అరేబియా సముద్రం వైపుగా ప్రయాణించి 5న కేరళ సముద్రతీరానికి వచ్చారు. పడవలో డీజిల్‌ అయిపోవడంతో నడి సముద్రంలో చిక్కుకున్నారు. బంధువులకు విషయం చేరవేశారు. వారు జాలర్ల సంఘాలతో మాట్లాడి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం ఇచ్చారు. రెండు గస్తీ నౌకల్లో వెళ్లి జాలర్లను కాపాడి కొచ్చికి తీసుకొచ్చారు. కొచ్చి పోలీసుల దర్యాప్తు అనంతరం జాలర్లు మంగళవారం రాత్రి రామనాథపురానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని