logo

విద్యార్థులకు ప్రతినెలా రూ.1000

ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్‌ పుదల్వన్‌’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్‌దాస్‌ మీనా తెలిపారు.

Published : 09 May 2024 00:53 IST

జులై నుంచి ‘తమిళ్‌ పుదల్వన్‌’ పథకం
సీఎస్‌ శివ్‌దాస్‌ మీనా

విద్యార్థినులతో మాట్లాడుతున్న శివ్‌దాస్‌ మీనా

చెన్నై, న్యూస్‌టుడే: ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్‌ పుదల్వన్‌’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్‌దాస్‌ మీనా తెలిపారు. నగరంలోని అన్నా శతాబ్ది గ్రంథాలయం ప్రాంగణంలో చెన్నై జిల్లాకు చెందిన విద్యార్థుల కోసం ‘కల్లూరి కనవు’(కళాశాల కల) కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు మహోన్నత పాఠశాలల్లో 12వ తరగతి చదివిన విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. శివ్‌దాస్‌ మీనా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి మురుగానందం, ఇతర అధికారులు విద్యార్థులకు పలు సూచనలు అందించారు. శివ్‌దాస్‌ మీనా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థుల హాజరు పెరిగిందన్నారు. ‘పుదుమై పెణ్‌’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000 అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు. ఉన్నత విద్యలో పలు అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘తమిళ్‌ పుదల్వన్‌’ పథకాన్ని జులై నుంచి ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని