logo

చిత్రవార్తలు

పక్షులంటే ఆసక్తి ఉన్న కొందరు వాటి సంరక్షణలోనూ తమ అభిరుచి చాటుకుంటున్నారు. అలా వచ్చిందే ఈ ఆలోచన. విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ సమీపంలోని పాండురంగా పురంలో పక్షులకు ఆహారంగా వడ్లు అందుబాటులో ఉంచే క్రమంలో...వరికంకులనే వడ్డాణంలా తయారు చేయించి చూడముచ్చటగా ఇంటి ముందు వేలాడదీశారు.

Published : 20 May 2022 04:29 IST

వడ్ల వడ్డాణం!

పక్షులంటే ఆసక్తి ఉన్న కొందరు వాటి సంరక్షణలోనూ తమ అభిరుచి చాటుకుంటున్నారు. అలా వచ్చిందే ఈ ఆలోచన. విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ సమీపంలోని పాండురంగా పురంలో పక్షులకు ఆహారంగా వడ్లు అందుబాటులో ఉంచే క్రమంలో...వరికంకులనే వడ్డాణంలా తయారు చేయించి చూడముచ్చటగా ఇంటి ముందు వేలాడదీశారు.

- ఈనాడు, విశాఖపట్నం


ప్రతి అరలో....  హరిత శోభ!

విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఇస్కాన్‌మందిరం సమీపంలో ఓ నర్సరీ నిర్వాహకులు...తమ ఇంటి చుట్టూ మొక్కలు పెంచేందుకు చూపిన  ప్రత్యేక శ్రద్ధ ఆకట్టుకుంటోంది.  గోడలకు అరలు...అరలుగా చేసిన ఏర్పాట్లు...వాటిలో పెరుగుతున్న మొక్కల హరిత అందాలు అలరిస్తున్నాయి.   

- ఈనాడు, విశాఖపట్నం


ఐసీజీలో యోగా సాధన

యోగా చేస్తున్న సిబ్బంది

సింధియా, న్యూస్‌టుడే : భారతీయ తీరగస్తీదళం(ఐసీజీ) ఆధ్వర్యంలో ఏపీ విశాఖ కేంద్రం-6లో గురువారం అధికారులు, సిబ్బంది యోగా సాధన నిర్వహించినట్టు ఐసీజీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా  రక్షణశాఖ ఆదేశాలతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపాయి. కోస్టుగార్డు నౌక ఐసీజీ రాణి డెక్‌పై,  కోస్టుగార్డు కార్యాలయం, ఉద్యోగుల నివాస సముదాయం, జెట్టీ, పార్కుల ప్రాంగణాల్లోనూ సాధన జరిగిందని వివరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని